Digital Transformation Award: తెలంగాణ పోలీసులకు జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు..! 3 d ago
TG : తెలంగాణ పోలీసులకు జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు వచ్చింది. వినూత్న ప్రాజెక్ట్ 'ఈపీటీ కేస్ సిస్టమ్' కోసం 'ఎం గవర్నెన్స్ ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్' కేటగిరీ కింద 15వ నేషనల్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు 2024ని గెలుచుకున్న తెలంగాణ పోలీసు పీసీఎస్ అండ్ ఎస్ టీమ్‌ను తెలంగాణ అదనపు డీజీపీ వీవీ శ్రీనివాసరావు అభినందించారు. ఈ-పెట్టీ కేసులకు సంబంధించి మొబైల్ యాప్ అవిష్కరణకు గాను తెలంగాణ పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ స్టాండర్డైజేషన్ విభాగానికి ప్రతిష్ఠాత్మకమైన 15వ జాతీయ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అవార్డు దక్కింది.
దీంతో టెక్నాలజీ వినియోగంలో తెలంగాణ పోలీసు విభాగం దేశవ్యాప్తంగా విశిష్ట స్థానాన్ని ఏర్పరచుకుంది. గతంలో కూడా గణేశ్ నిమజ్జనం సజావుగా సాగిపోయేందుకు తెలంగాణ పోలీసులు ఉపయోగించిన సాంకేతిక పరిజ్ఞానానికి డిజిటల్ ఇంజినీరింగ్ అవార్డు లభించింది. జాతీయస్థాయిలో ఆయా రాష్ట్రాలు అమలు చేస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిశీలించి ఈ అవార్డు కోసం ఎంపిక చేస్తారు.